
రెండో వన్డేలో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె (44) మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్ లో లంక రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. కరుణరత్నె చివరి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు.