హాట్ బ్యూటీ ‘కృతి సనన్’ ఒక పడి లేచిన కెరటం, ఫేడ్ అవుట్ హీరోయిన్ కి కూడా బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి, కానీ.. ప్లాప్ హీరోయిన్ అని ముద్ర పడిన హీరోయిన్ కి మాత్రం అక్కడ ఛాన్స్ లేదు. గతంలో ఎందరో మహా మహా అందగత్తెలే ఈ విషయంలో ఏమి చేయలేక చేతులెత్తేశారు. అందుకే ‘కృతి సనన్’ కెరీర్ క్లోజ్ అయింది అనుకున్నారు. కానీ ‘కృతి సనన్’ అనుకోలేదు.
ప్లాప్స్ వచ్చింది తానూ నచ్చక కాదు కదా, సినిమా నచ్చక. అలాంటపుడు తానెందుకు భయపడాలి. అందుకే, ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కసి పెంచుకుంది. ఫామ్ లో ఉన్న దర్శకులు చుట్టూ స్టార్ హీరోల చుట్టూ తిరిగి తిరిగి మొత్తానికి అక్షయ్ కుమార్ ను పట్టుకుంది. అంతే, ఇక అప్పటి నుండి ‘కృతి సనన్’ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ టైంలోనే బాలీవుడ్ లో స్టార్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం ‘కృతి సనన్’ హిందీ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఒకప్పుడు మొహం చాటేసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు ఆమె డేట్లు కోసం ఆమె చుట్టూ తిరుగుతున్నారు. మొత్తమ్మీద తన కెరీర్ పూర్తిగా సెట్ చేసుకుంది ఈ టాల్ బ్యూటీ. అందుకే ఇప్పుడు తన చెల్లిని కూడా హీరోయిన్ గా పరిచయం చేయడానికి సన్నద్ధం అయింది.
ఇంతకీ కృతి సనన్ చెల్లి పేరు ‘నుపుర్ సనన్’. ఇప్పటికే ఈ కుర్ర భామ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఓ ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడింది. అమ్మడుకు ఆ పాటలో మంచి పేరే వచ్చింది. అందుకే, నుపుర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతుంది కృతి. కృతి సనన్ ప్రస్తుతం టైగర్ ష్రోఫ్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది.
కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఉందట. ఆ పాత్రకు నుపుర్ ని రికమండ్ చేసింది కృతి సనన్. అలాగే తన చెల్లిని సోలో హీరోయిన్ గా కూడా ఓ సినిమాలో పరిచయం చేయాలని అక్షయ్ కుమార్ ను రిక్వెస్ట్ చేస్తోందట. అక్షయ్ ది విశాల హృదయం కాబట్టి అంగీకరించాడట.