
మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీ బయలుదేరారు. ఇటీవల ఆయన భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన ఆ పార్టీలో చేరతారని సమాచారం. ఈటల దిల్లీ ప్రయాణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. భూ అక్రమణల ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల దాదాపు అన్ని పార్టీల నాయకులతో ఇటీవల చర్చలు జరిపిన విషయం తెలిసిందే.