Homeవార్త విశ్లేషణViral video : తండ్రికి రూ. 3 కోట్ల కారు బహుమతిగా ఇచ్చిన కొడుకు.. వైరల్...

Viral video : తండ్రికి రూ. 3 కోట్ల కారు బహుమతిగా ఇచ్చిన కొడుకు.. వైరల్ వీడియో..

Viral video : ‘పుత్రోత్సాహం గురించి సుమతీ శతకంలో భద్ర భూపాలుడు వివరించాడు. ఆయన పద్యం ప్రకారం.. పుత్రుడు (కొడుకు) పుట్టినప్పుడు ఏ తండ్రికి పుత్రోత్సాహం కలుగదు. జనులు ఆ పుత్రుడిని కీర్తించినప్పడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందనేది దీని భావం. జీవితంలో విజయం సాధించినప్పుడు ఆ ఆనందాన్ని తల్లిదండ్రులకు అందించే పిల్లల కథలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ గా మారింది. తన తండ్రి రైతుగా ఉండి తనను కష్టపడి చదివించడంతో ప్రయోజకుడైన కొడుకు తండ్రికి విలువైన కారును బహుమతిగా అందించాడు. దీంతో రైతు కొడుకును ప్రజలు పొగుడుతున్నారు. స్వయంగా షోరూంకు వచ్చిన తల్లి తండ్రి వద్ద ఆశీర్వాదం తీసుకున్న కుమారుడు తండ్రికి తాళం అందజేశాడు. కొడుకు బహుమతికి మురిసిపోయిన తండ్రి కారును నడిపి సంతోషం వ్యక్తం చేశాడు. మెర్సిడెస్ బెంజ్ కు చెందిన జీ-వ్యాగన్ కారును కొడుకు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు క్రిష్ గుజ్జర్ షేర్ చేశారు. వాహనాన్ని అందుకున్న తర్వాత తన తండ్రి, తన తల్లితో కలిసి సంతోషంగా డ్రైవింగ్ చేస్తున్న ఫుటేజీ వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 3 కోట్లకు పైగా ఉంటుంది.

ఉన్నత స్థాయి వ్యక్తులు వాడేది..
ఈ జర్మన్ కారు ప్రముఖులు, ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు ఎక్కువగా వాడుతారు. వీడియోలో రైతు మెర్సిడెస్-బెంజ్ డీలర్‌ షిప్ వద్ద తన భార్య, కొడుకుతో కలిసి మెర్సిడెస్ GLS కారులో వస్తున్నాడు.

ఈ ఎస్‌యూవీకి అధిక డిమాండ్
గతంలో పూణేకు చెందిన ఒక బంగారు వ్యాపారి తన తల్లిదండ్రులకు రూ. 1.7 కోట్ల ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. మెర్సిడీజ్ బెంజ్ భారతదేశంలో G 400d (డీజిల్), G63 AMGను విక్రయిస్తోంది. దేశంలో ఈ ఎస్‌యూవీకి చాలా డిమాండ్ ఉంది. G400d AMG లైన్, G400d అడ్వెంచర్ వెర్షన్ల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 2.55 కోట్లు. ట్యాక్స్, ఇతర ఛార్జీలతో కలిపి, ఆన్-రోడ్ ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువే.

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అమర్చారు
మెర్సిడీజ్ బెంజ్ G 400d గురించి చెప్పాలంటే, ఇందులో 3.0-లీటర్ ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ (OM656) ఉంది. ఇది 326 bhp, 700 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. ఈ 2.5-టన్నుల SUV కేవలం 6.4 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 241 మిమీ.

ఈ ఎస్‌ యూవీలో ప్రీమియం నప్పా లెదర్‌లో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, స్లైడింగ్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లు ఉన్నాయి. ఇది 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అమర్చారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version