https://oktelugu.com/

Prabhas : ‘స్పిరిట్’ చిత్రం కోసం ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సందీప్ వంగ..? ఏకంగా 5 రేట్లు ఎక్కువనా?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'.

Written By:
  • Vicky
  • , Updated On : December 12, 2024 / 03:12 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. కానీ హైప్ మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పడింది. ప్రభాస్ ఈ చిత్రంలో నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాదు ఆయన క్యారక్టర్ చాలా వయొలెంట్ గా కూడా ఉంటుందట. సందీప్ వంగ చిత్రాల్లో హీరో క్యారక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటుందో అర్జున్ రెడ్డి, ఎనిమల్ చిత్రాల ద్వారా మనమంతా చూసాము. ‘స్పిరిట్’ చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ఇంకా పది రేట్లు వైల్డ్ గా ఉండబోతుందట. ప్రభాస్ లాంటి కటౌట్ కి అలాంటి క్యారెక్టర్లు పడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటో ఊహించడానికే కష్టం గా ఉంది కదూ.

    ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని సందీప్ వంగ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రం నుండి భారీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందట. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఈ చిత్రానికి సందీప్ వంగ తీసుకునే రెమ్యూనరేషన్ ప్రభాస్ కి మించి ఉంటుందట. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 120 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సందీప్ వంగ అంతకు మించి రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. సందీప్ కి అంత రెమ్యూనరేషన్ ఎందుకొస్తుందో ఒకసారి వివరంగా చూద్దాం.

    సందీప్ వంగ ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలను తన అన్నయ్యనే నిర్మించాడు. ‘భద్రకాళీ’ ఎంటర్టైన్మెంట్ సంస్థ ని స్థాపించి, కేవలం మూడు సినిమాలతోనే వేల కోట్ల రూపాయిల లాభాలను పొందారు ఈ అన్నదమ్ములు. ‘స్పిరిట్’ చిత్రానికి కచ్చితంగా ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేస్తాడు. తన అన్నయ్య నిర్మించే ప్రతీ సినిమాలో సందీప్ వంగ కి 50 శాతం వాటా ఉంటుంది. ఆ విధంగా ‘స్పిరిట్’ చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే అందులో 500 కోట్ల రూపాయిలు సందీప్ వంగ కి దక్కుతుంది. ఆ విధంగా సందీప్ వంగ రెమ్యూనరేషన్ ప్రభాస్ కంటే ఎక్కువ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ సందీప్ వంగ ఇతర ప్రొడక్షన్ లో పని చెయ్యాల్సి వస్తే 50 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేసేంత క్రేజ్ ఉందట.