
దేశంలో గత 24 గంటల్లో కొత్తటా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493 కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, మరో 3,87,673 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 35,743 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 53.61 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. శుక్రవారం 40 వేలకు పైగా కేసలు నమోదు కాగా, నిన్నటితో పోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువ గా ఉంది.