Corona: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

దేశంలో కరోనా  కేసులు కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన 3,32,158 మంది చికిత్స పొందుతున్నారు. మరో 4,44,838 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 38,945 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 309 మంది మరణించారని తెలిపింది. కొత్తగా నమోదైన […]

Written By: Suresh, Updated On : September 19, 2021 11:08 am

Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

Follow us on

దేశంలో కరోనా  కేసులు కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన 3,32,158 మంది చికిత్స పొందుతున్నారు. మరో 4,44,838 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 38,945 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 309 మంది మరణించారని తెలిపింది.

కొత్తగా నమోదైన కేసుల్లో 19,325 కేసులు కేరళలో నమోదయ్యాయని, 143 మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 80,43,72,331 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శనివారం ఒకేరోజు 85,42,732 మందికి వ్యాక్సినేషన్ చేశారు.

దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హచ్చుతగ్గులు నమోదవుతన్నాయి. ఇక కొవిడ్ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసు సంఖ్య 80 కోట్ల మైలురాయిని దాటింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 80,43,72,331కి చేరింది. దేశంలో క్రియాశీల కేసులు మరోసారి 1 శాతం దిగువకు చేరాయి. ప్రస్తుతం 3,32,158 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.