
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,746 కరోనా కేసులు నమోదవగా, కోవిడ్ తో 20 మంది మరణించారు. ఏపీలో మొత్తం 19,90,656 పాజిటివ్ కేసులు నమోదవగా, రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 13,615 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 18,766 యాక్టివ్ కేసులు ఉండగా, 19,58,275 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇవాళ కోవిడ్ నుంచి 1,648 మంది రికవరీ అయ్యారు.