
దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 195 పెరిగి రూ. 48,608 కి చేరింది. క్రితం ట్రేడ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 48,413 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడమే ఇవాళ పసిడి ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. ఇక వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 15 తగ్గి రూ. 70,521 కి చేరింది.