
ఎప్పుడు వార్తల్లో ఉండే పవన్ కల్యాణ్ కొద్ది రో జులుగా ఎవరికి కనిపించడం లేదు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఇంట్లోనే ఉండిపో యారు. అయినప్పటికీ అభిమానులకు సైతం దొరకకుండా ఉండిపోయారు. దీంతో వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు తిరుపతి ఎన్నికల్లో కనిపించిన పవన్ తరువాత కనిపించకుండా పోయారు. తమ అభిమాన నటుడు కనిపించకపోయే సరికి అభిమానుల్లో ఆత్రం పెరిగింది. ఎలాగైనా చూడాలని భావించారు. సోషల్ మీడియాలో సైతం ఆయన దర్శన భాగ్యం దొరకలేదు.
ఎట్టకేలకు పవన్ దర్శనం దొరికింది. పవన్ కల్యాణ్, కొడుకు అకిరానందన్ తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన నటుడు కనిపించేసరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు. అదీ కూడా కొడుకుతో కలిసి రావడంతో సంతోషం రెట్టింపయింది.
రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అకిరా సంగీతం నేర్చుకుంటున్నాడని, సంగీతం క్లాస్ కోసం పవన్ కల్యాణ్ అకాడమీ వరకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆసమయంలో సంగీతం టీచర్ తో దిగిన ఫొటో అవని ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు పవన్ కనిపించడంతో అభిమానులు కాస్త చల్లబడ్డారు.
చివరకు జనసైనికులకు దర్శనం దొరికింది. పవన్ కోసం ఎన్నో రో జుల నుంచి ఎదురు చూస్తున్నారు. తమ నాయకుడు కనిపించే సరికి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడు ప్రెస్ నోట్ లోనే కనిపించే పవన్ ఇలా ప్రత్యక్షమయ్యే సరికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనివితీరా చూసుకుని మురిసిపోతున్నారు. ఇన్నాళ్లకైనా దర్శనం దొరికినందుకు తపించిపోతున్నారు.