అంధగాయకుడు, స్వరకర్త, రాగప్రియ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకుడు ఎం. జే, సీ కోమగన్ (48) అనారోగ్యంతో కన్నుమూశారు. చేరన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఆటో గ్రాఫ్ మూవీలో అంధగాయనీ గాయకులు, వాద్యకారులపై ఓ పాటను చిత్రీకరించారు. అంధుడైన కోమగన్ చక్కని గాయకుడు మాత్రమే కాదు వాద్యకారుడు. 1991 లో రాగప్రియ సంస్థను కోమగన్ తొమ్మిది మంది సభ్యులతో మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతని సంగీత బృందంలో మొత్తం 25 మంది ఉన్నారు. 1999 లో 16 గంటల పాటు నాన్ స్టాప్ గా 183 పాటలను పాడి, ఈ సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది.