Shubman Gill : అఖండ సినిమా చూశారా.. అందులో శ్రీకాంత్ ను ఉద్దేశించి..”ఒక్కసారి డిసైడై బరిలోకి దిగితే.. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకెళ్లిపోతా..” అని బాలకృష్ణ అంటాడు గుర్తుందా.. ఇప్పుడు టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ కూడా అలాగే దూసుకుపోతున్నాడు. కెరియర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్న అతడు.. అద్భుతమైన ఆటతీరు కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో.. ఇప్పటికే గిల్ 70* పరుగులు చేశాడు. సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరాశపరచినప్పటికీ.. గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బోర్డర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ సీజన్లో మరొక హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని… గిల్ కేంద్రంలో టీమిండియా సమర్థవంతంగా చేదిస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా గిల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
2026 సంవత్సరంలో ఇప్పటివరకు గిల్ వన్డే ఫార్మాట్లో ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. టీమిండియా పగ్గాలు అందుకున్న తర్వాత గిల్ తన ఆట తీరుకు మరింత పదులు పెట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు. ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు.. 50*(51), 154(110), 84″(66), 23 (18), 56 (53), 75*(70) 2026 లో గిల్ వన్డే ఫార్మాట్ లో చేసిన పరుగులు ఇవి.
వన్డే ఫార్మాట్లో.. ఈ ఏడాది ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు.. సమర్థవంతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు గిల్. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో గిల్ తొలి మ్యాచ్లో తన నాయకత్వ పటిమను చూపించాడు. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించాడు. కేవలం ఆ జట్టు 258 పరుగులకే చేసే విధంగా బౌలింగ్ వేయించాడు. బుమ్రా.. ప్రసిద్ కృష్ణ, దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బ్రార్ వంటి వారితో బౌలింగ్ వేయించి.. ఇంగ్లాండ్ జట్టు మీద ఒత్తిడి తీసుకొచ్చాడు.
Captain leading from the front.
Shubman Gill registers his third successive half-century, continuing his brilliant run of form. #ENGvIND 1st ODI Streaming LIVE on JioHotstar! pic.twitter.com/LGBDr1O7t0
— Star Sports (@StarSportsIndia) July 14, 2026
