
ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ ఫైట్ ముగిసింది. మెడల్ పై ఆశలు రేపిన ఆమె రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి పట్టింది. కొలింబియాకు చెందిన ఇన్ గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. తొలి రౌండ్ లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్ కు కోలుకునే అవకాశం దక్కలేదు. తొలి రౌండ్ లోనే నలుగురు జడ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు. అయితే రెండో రౌండ్ లో మేరీ పుంజుకొని ప్రత్యేర్థిపై పైచేయి సాధించింది. కీలకమైన మూడో రౌండ్ లో మరోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్ కు ఓటమి తప్పలేదు.