Pharma Web Series Series Review: ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే ప్రత్యేకమైన స్థానం ఉండేది. వాళ్ల నుంచి వచ్చిన సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తుంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని భాషల దర్శకులు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక చాలా మంది స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు… ఇలాంటి సమయంలోనే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి కొత్త కాన్సెప్ట్ లతో సిరీస్ లు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే కొన్ని సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు…ఫార్మా అనే సిరీస్ రీసెంట్ గా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది…ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పిస్తోందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
కేపీ వినోద్ (నివిన్) ఒక ఫార్మా కంపెనీ లో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తుంటాడు. తను చేసే పనిలో మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి ఆ తర్వాత మాత్రం తన పనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు దూసుకెళ్తుంటాడు. తన కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్న ఒక ప్రాడెక్ట్ ను జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను కంపెనీ చైర్మన్ వినోద్ కి అప్పగిస్తాడు. డాక్టర్ అయిన జానకి (శృతి రామచంద్రన్) తను చేసిన రీసెర్చ్ లో వినోద్ సేల్ చేసే మెడిసిన్ లో ఒక ఫాల్ట్ ఉంటుంది.
దాని వల్ల చాలా మంది చిన్నారులు మధుమేహం వ్యాధికి గురి అవుతున్నారని తెలుసుకొని వినోద్ కి చెబుతోంది. దాంతో వినోద్ తన కంపెనీ చైర్మన్ మీద చేస్తున్న తప్పుడు పని మీద ఎలా రెస్పాండ్ అయ్యాడు అనేది తెలియాలంటే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ మూవీ దర్శకుడు మొదటి నుంచి కథ మీద ఫోకస్ చేసినప్పటికి కథలో కొన్ని ఫాల్స్ ఉన్నాయి. ఆయన వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు…సినిమా స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపించినప్పటికి మధ్యలో కొన్ని సీన్స్ చూస్తే మనకు ఇతర సినిమాల్లో చూసిన సీన్స్ మాదిరిగానే అనిపిస్తాయి. ఇక ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి…
ఇక ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే సెకండాఫ్ లో ఒక ట్విస్ట్ రివిల్ అవుతుందో అప్పటి నుంచి సినిమా సైడ్ ట్రాక్ వెళ్లినట్టుగా అనిపించింది. ఒక హిట్ సినిమా కు ఏం కావాలో అవన్నీ ఇందులో మిస్ అయ్యాయి. ప్రతి సీన్ ను ఒక శిల్పం లా చెక్కుతుండాలి. అలా చేసినప్పుడే సినిమాలో వెయిట్ పెరుగుతోంది. దానివల్ల సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు సైతం ఎంజాయ్ చేస్తాడు…
ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు ఎగ్జైట్ అయినప్పుడే సినిమా సక్సెస్ అవుతోంది. అలా కాకుండా ప్లాట్ నేరేషన్ తో ముందుకు సాగితే చాలా కష్టమవుతుందనే చెప్పాలి…ఇక ఈ మూవీలో హీరో నటన బాగుంది…ఆయన మెడికల్ రిప్రజెంటర్ గా కష్టపడుతుంటే మెడికల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది చాలా క్లారిటీ గా చూపించారు…ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు ఇంకా ఉంటే సినిమా పక్కగా ప్రేక్షకుడిని బాగా ఎంగేజ్ చేసేది…రైటింగ్ లో బాగా కష్టపడినప్పటికి డైరెక్షన్ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా చేయలేకపోయాడు…
బాగున్నవి
కాన్సెప్ట్
నవీన్ నటన
బాగోలేనివి
డైరెక్షన్
రేటింగ్ : 2/5
ఫైనల్ వర్డ్ : ఖాళీగా ఉంటే ఒకసారి చూడచ్చు…