
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇల్లందుకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్ షబ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. షబ్బీర్ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల అందులో భాగంగా ఇవాళ సిరిసేడులో దీక్షలో కూర్చు్న్నారు.