https://oktelugu.com/

హన్సిక ప్రయోగం వర్కౌట్ అవుతుందా ?

సినిమా అంటేనే వేల షాట్స్ తీసి.. గంటల తరబడి ఎడిటింగ్ చేస్తారు. కానీ ఒక్క కట్ కూడా లేకుండా సినిమా తీస్తే.. ఈ ఐడియా బాగుంది గాని, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అందుకే, ఇన్నేళ్లు ఇలాంటి ఐడియాతో ఎవరూ సినిమా చేయలేదు. మొదటి సారి చేశారు. పైగా ఆ సినిమాలో నటించింది ప్రముఖ హీరోయిన్. అవును, హన్సిక హీరోయిన్ గా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో, ఒక్క కట్ […]

Written By:
  • admin
  • , Updated On : August 10, 2021 / 11:01 AM IST
    Follow us on

    సినిమా అంటేనే వేల షాట్స్ తీసి.. గంటల తరబడి ఎడిటింగ్ చేస్తారు. కానీ ఒక్క కట్ కూడా లేకుండా సినిమా తీస్తే.. ఈ ఐడియా బాగుంది గాని, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అందుకే, ఇన్నేళ్లు ఇలాంటి ఐడియాతో ఎవరూ సినిమా చేయలేదు. మొదటి సారి చేశారు. పైగా ఆ సినిమాలో నటించింది ప్రముఖ హీరోయిన్.

    అవును, హన్సిక హీరోయిన్ గా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో, ఒక్క కట్ లేకుండా సినిమాని తీశారు. ఆ సినిమా పేరు ‘105 మినిట్స్’. టైటిలే చాలా కొత్తగా ఉంది కాబట్టి.. ఈ సినిమా గురించి ప్రస్తుతం నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’ అనేవి ఈ సినిమాలో హైలైట్స్ కానున్నాయి.

    పైగా హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి.. సినిమాలో మ్యాటర్ ఉండేలా ఉంది . కాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ సినిమా మొత్తం షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ “105 మినిట్స్” సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబీ రిలీజ్ చేశాడు, లుక్ బాగుంది, సంకెళ్లతో హన్సికను బంధించారు, అలాగే ఆమె రక్తపు మరకలతో ఉంది.

    మొత్తానికి హన్సిక కెరీర్ లో మొదటిసారి ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తోంది. బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నాడు. మరి హన్సిక ప్రయోగం వర్కౌట్ అవుతుందా ?