
మహబూబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అదే పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళ శిక్షణ ఎస్సై తనపై శ్రీనివాస రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధిత ట్రైనీ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించింది. నిన్న రాత్రి అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది.