
నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులంతా రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.