ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) కన్నుమూశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించినట్లు ఆయన తనయుడు శివకుమార్ తెలిపారు. 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా చేయడంతో పాటు తన భార్య బి. జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాన్నాళ్లపాటు సూపర్ హిట్ అనే సినీ పత్రికను నడిపారు. బీఏ రాజుకు ఇద్దురు కుమారులు ఉన్నారు. […]
ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) కన్నుమూశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించినట్లు ఆయన తనయుడు శివకుమార్ తెలిపారు. 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా చేయడంతో పాటు తన భార్య బి. జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చాన్నాళ్లపాటు సూపర్ హిట్ అనే సినీ పత్రికను నడిపారు. బీఏ రాజుకు ఇద్దురు కుమారులు ఉన్నారు. భార్య జయ 2018లో కన్నుమూశారు.