
భారత అథ్లెటిక్స్ సమాఖ్య మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెండిరటా (60) కరోనాతో మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన అరుణ్ చికిత్స పొందతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్ఐ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల టోక్యో ఒటింపిక్స్ లో పాల్గొనే భారత్ టీమ్ కు చీఫ్ మెడికల్ ఆపీసర్ గా భారత్ ఒలింపిక్ సంఘం అరుణ్ ను నియమించింది. దాంతో ఆయన భారత క్రీడాకారులు బృందంతో పాటు టోక్యో కు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పనిచేస్తుండటం విశేషం.