
ఖమ్మంలో జిల్లాలో పోలీసులు ఖారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగుడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచాంర అందింది. ఈ మేరకు దాడి చేసి రూ. 1.5 లక్షల విలువైన జిలెటిక్ స్టిక్స్, డిటోనేటర్లు, సల్ఫర్ ను పట్టుకున్నారు. పేలుడు పదార్థాలను నిల్వ చేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.