
పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు పది రోజుల్లోనే మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ రాయ్ పూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ తర్వాత శిశువుకు జ్వరం రావడంతో ఆగర్వాల్ దంపుతులు భువనేశ్వర్ లోని జగన్నాథ్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ అరిజిత్ మోహపాత్ర తల్లిదండ్రుల అనుమతితో రెమ్ డెసివిర్ ను ఇంజెక్షన్ ఇచ్చారు. చివరకు చికిత్సకు సానుకూలంగా స్పందించి కోలుకుంది. పదిరోజుల్లో శిశువు కోలుకుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.