
నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారులు నిర్వమించిన తనిఖీల్లో 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. మల్దకల్ మంలలం నేత్వానిపల్లిలో ఓ వ్యాపారి అక్రమంగా నిల్వ చేసిన విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.