
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో ప్రత్యేకత చూపిస్తున్నారు. పరిపాలనలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందరు ముఖ్యమంత్రుల తీరుగా కాకుండా తన పద్ధతుల్లో ప్రారంభిస్తున్నారు. పథకాల్లో లోతైన విశ్లేషణ, ఆలోచన ఉంటాయని మేధావులు సైతం ప్రశంసిస్తున్నారు. ఏపీలో ఏ వర్గం కూడా కష్టపడకూడదని పథకాలు రూపొందిస్తున్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాంతాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతూ పురోగమనం సాధించాలని భావిస్తున్నారు.
మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే కుల సంఘాలు, పిల్లలు, వృద్ధులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేకత చాటుతున్నారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఏ పథకమైనా మీట నొక్కి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. విశాఖ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
రాజధాని విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నా జగన్ మాత్రం అనుకున్నదే చేశారు. విశాఖపట్నంనే పరిపాలన రాజధానిగా చేశారు. దీనికి గత ఏడాదే చట్టపరమైన ఆమోదముద్ర కూడా వేశారు. ప్రస్తుతం ఇది న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఇవాళ కాకపో యినా రేపయినా విశాఖ ఆంధ్రకు అసలైన రాజధాని అవుతుందని నేతలు చెబుతున్నారు.
జగన్ దూరదృష్టితో వ్యవహరిస్తారనే విషయం తెలుస్తోంది. అన్ని వర్గాలు, ప్రాంతాలు ప్రగతిపథంలో పయనించాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. జగన్ అజెండా కూడా అదే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను రాజధానిగా చేసి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారని సమాచారం. జగన్ విశాఖను రాజధానిగా చేయడం ద్వారా అన్ని వర్గాల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తున్నారు.