Sandeep Reddy Vanga : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతోనే సినిమాలు చేయడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఇష్టపడుతుంటారు. అందుకే మన స్టార్ హీరోలందరు ఎప్పుడు సక్సెస్ ల బాటలో ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక క్రేజ్ ఏర్పడటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకునే అవకాశమైతే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా అఖిల్ సినిమాతో సక్సెస్ ని సాధించడంతో సందీప్ రెడ్డి వంగ తో సైతం సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ ని హీరోగా పెట్టి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరికొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ తో ఆయన సినిమా చేసే అవకాశాలైతే లేవు అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అఖిల్ సైతం సందీప్ తో సినిమా చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కానీ అది ఇప్పుడప్పుడే వర్కౌట్ అయ్యే అవకాశాలైతే లేవు. ఎందుకంటే సందీప్ ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన లైనప్ చాలా పెద్దగా ఉంది.
ప్రభాస్ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో కానీ రామ్ చరణ్ తో గాని ఆయన సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరితో కూడా సినిమాలు ఉంటాయట. అలాంటప్పుడు అఖిల్ తో ఆయన సినిమా ఎందుకు చేస్తాడు అంటు కొంతమంది కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అఖిల్ మార్కెట్ కూడా అంత పెద్దగా లేదు.
కాబట్టి సందీప్ రెడ్డి వంగ మార్కెట్ కి సరిపడా హీరోగా తను ఎదిగినప్పుడు మాత్రమే సందీప్ అతనితో సినిమా చేస్తాడు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు… నిజానికి సందీప్ అతనితో సినిమా చేయకపోయిన తన శిష్యులు ఎవరైనా అఖిల్ తో సినిమా చేస్తే మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది..
