
జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారు. రాయలసీమ నీటి విషయంలో పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నేనూ ఉన్నాను. సీమ కష్టాలు తెలుసునని పరిష్కరించుకుందామని కేసీఆర్ చెప్పారు. నీటి విషయంలో ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలని కేసీఆర్ అన్నారని సజ్జల పేర్కొన్నారు.