
దేశంలో కరోనా కేసుల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గినా అజాగ్రత్తగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహం చికిత్సలో భాగంగా వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘యాస్పైర్-బయోనెస్ట్’ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.
ఈ ఔషధం కరోనా స్పైక్ ప్రొటీన్‌లోని రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌ను బలంగా పట్టుకోవడం ద్వారా ఏస్2 రిసెప్టార్లతో అనుసంధానం కాకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ మెడిసిన్ రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నిరోధించే లక్షణాలను కలిగి ఉండటంతో పాటు వాపు నిరోధక గుణాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వల్ల వచ్చే ఇన్ ఫ్లమేషన్ ను, రక్తం గడ్డలు కట్టడాన్ని ఎర్టుగ్లిఫ్లోజిన్ వాడడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
యాస్పైర్ బయోనెస్ట్ ఒక లైఫ్‌సైన్సెస్ స్టార్టప్ సంస్థ కొవిడ్ కు ఎర్టుగ్లిఫ్లోజిన్ సురక్షితమైన, చౌకైన ఔషధమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాకు ఎక్కువ సంఖ్యలో ఔషధాలు వస్తే వైరస్ కు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు కేసులు తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచనలు చేస్తుండటం గమనార్హం. మాస్క్ తప్పనిసరిగా కచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
భౌతికదూరం పాటించడం ద్వారా శానిటైజర్ వాడటం ద్వారా మాత్రమే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కరోనా వైరస్ త్వరగా అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.