
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నారిపై ఘోరానికి పాల్పడ్డ మృగం మృతదేహం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ మీద పడి ఉందని తెలంగాణ డీజీపీ చెప్పారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో రాజును అరెస్టు చేసినట్లు తనకు తప్పుడు సమాచారం వచ్చిందని.. అందుకు చింతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.