Saidabad Raju Dead: యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన 6 ఏళ్ల బాలిక హత్యచారం కేసులో చిక్కుమడి వీడింది. హైదరాబాద్ సైదాబాద్ లో బాలికపై హత్యచారం చేసిన కీచక నిందితుడు రాజు కుక్కచావు చచ్చాడు. 6 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకొని చచ్చాడు.
రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేసు ఘటనలో రాజు నిందితుడు. 6 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన రాజు పారిపోయాడు. అతడిపై 10 లక్షల రివార్డ్ వేసి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
రాజు పారిపోయిన అనంతరం చివరి సారిగా ఉప్పల్ లో సీసీటీవీకి చిక్కాడు. అతడి ఆచూకీ కోసం తెలంగాణ అంతటా జల్లెడ పడుతున్న వేళ రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి చెక్ చేశారు.
రాజు చేతిపై ఉన్న టాటూను చూసి ఇది సైదాబాద్ నిందితుడే అని తేల్చారు.
-నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న వీడియో..