https://oktelugu.com/

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు శుభవార్త.. 4 నెలలకే ఆ సమస్య?

Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లలో చాలామందికి కేవలం 4 నెలల్లోనే భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 614 మంది హెల్త్ వర్కర్లలో ఇదే విధంగా జరిగింది. అయితే యాంటీ బాడీలు తగ్గిపోయినా బాడీ మెమరో సెల్స్ గణనీయమైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 16, 2021 / 11:48 AM IST
    Follow us on

    Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లలో చాలామందికి కేవలం 4 నెలల్లోనే భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 614 మంది హెల్త్ వర్కర్లలో ఇదే విధంగా జరిగింది.

    అయితే యాంటీ బాడీలు తగ్గిపోయినా బాడీ మెమరో సెల్స్ గణనీయమైన రక్షణ అందిస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. భువనేశ్వర్ లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సంఘమిత్ర పతి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోస్ అవసరమో కాదో చెప్పడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. పలు ప్రాంతాల్లో స్టడీలు నిర్వహించాలని అనుకుంటున్నామని సంఘమిత్ర పతి పేర్కొన్నారు.

    బ్రిటీష్ రీసెర్చర్ల పరిశోధనలలో కేవలం ఆరు నెలల్లో ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు పనితనం కోల్పోయే అవకాశం ఉందని వెల్లడైంది. మరోవైపు మన దేశంలో 60 శాతం మంది ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకోగా 19 శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా వ్యాక్సిన్ గురించి వైరల్ అవుతున్న వార్తలు ప్రజల్లో టెన్షన్ ను మరింత పెంచుతున్నాయి.

    దేశంలో కరోనా కేసులు తగ్గడంతో కొంతమంది కరోనా వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకే అవకాశాలు అయితే తగ్గుతాయి.