రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ ను అపోలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. అంతర్గత గాయాలు ఏమి లేవని డార్టర్లు స్పష్టం చేశారు. ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని అపోలో వైద్యులు బులిటెన్ లో పేర్కొన్నారు. డాక్టర్ అలోక్ రంజన్ పర్యవేక్షణలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స నిర్వహిస్తున్నారు. కాలర్ బోన్ ఫ్యాక్షర్ సంబంధించి 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు తెలిపారు.