
కాసేపటి క్రితం అపోలో ఆసుపత్రికి వెళ్లారు మంచు మనోజ్. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ దురదృష్టకరం.ఆక్సిడెంట్ తర్వాత రోడ్ బాగు చేసినందుకు ధన్యవాదాలు. ఇంకొకరికి ఇలా జరగకుండా చర్యలు తీసుకున్నందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సాయి తేజ్ పై నెగెటివ్ వార్తలు దురదృష్టకరం అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుతున్నాను అన్నారు మంచు మనోజ్.