ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు అలర్ట్
ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రతి రెండు సీట్లలో ఒకటి ఖాళీగా ఉంచి 50 శాతం సీట్లు మాత్రమే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఏసీ స్లీపర్ లో కూడా సగం బెర్తులే కేటాయించనున్నారు. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సాప్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 50 శాతం సీట్లు ఆన్ లైన్ లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ […]
Written By:
, Updated On : April 24, 2021 / 08:02 AM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రతి రెండు సీట్లలో ఒకటి ఖాళీగా ఉంచి 50 శాతం సీట్లు మాత్రమే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఏసీ స్లీపర్ లో కూడా సగం బెర్తులే కేటాయించనున్నారు. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సాప్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 50 శాతం సీట్లు ఆన్ లైన్ లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు. ఇవన్నీ బుక్ అయ్యాకే మిగిలిన సీట్లు ఆన్ లైన్ లో కనిపించనున్నాయి.