ఈ విషయం సుమిత్ర మహాజన్ వరకూ వెళ్లడంతో ఆమె అవాక్కయ్యారు. దీంతో.. తాను బతికే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు తన కుమారుడు మందార్ ట్విటర్ అకౌంట్ ద్వారా తాను మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు.
‘‘నేను మరణించాననే వార్త దేశమంతా వ్యాపించింది. ఈ విషయం తెలిసిన బంధువులు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ముంబైలోని పలు న్యూస్ ఛానళ్లు సైతం ఈ వార్తను ఎందుకు ఫ్లాష్ చేశాయో అర్థం కాలేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
అయితే.. ఈ విషయమై ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చారు. నమ్మదగిన వ్యక్తుల నుంచి తనకు సమాచారం రావడం వల్ల తాను నిజమే అనుకున్నానని చెప్పారు. సుమిత్ర మహాజన్ కుమారుడితో మాట్లాడానని, ఈ తప్పుడు సమాచారం గురించి క్షమాపణలు కూడా కోరినట్టు ట్విటర్లో తెలిపారు.
సోషల్ మీడియాలో వాస్తవాలు ఎంతగా బయటకు వస్తున్నాయో.. అవాస్తవాలు కూడా అంతే స్థాయిలో ప్రచారం అవుతున్నాయి. బ్రేకింగ్ అన్నట్టుగా కనిపిస్తే.. వైరల్ చేసేస్తున్నారు. ఇక మీదటనైనా వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగితే బాగుంటుంది.