
గ్రామాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం కరోనా రహిత గ్రామం పేరుతో పోటీని ప్రకటించింది. కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన గ్రామ పంచాయతీకి ఫస్ట్ ప్రైజ్ కింద రూ. 50 లక్షలు, సెకండ్ ప్రైజ్ గా రూ. 25 లక్షలు, థర్డ్ ఫ్రైజ్ కింద రూ. 25 లక్షలు అందజేస్తామని మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి హసన్ ముష్రిఫ్ వెల్లడించారు.