రౌడీషీటర్ దారుణ హత్య

వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇతర రౌడీషీటర్ల చేతుల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం కేపిన ఈ ఘటన చాదర్ ఘాట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం టౌలీచౌకి హుయాయున్ నగర్ కు చెందిన సయ్యద్ ముస్తాక్ ఉద్దీన్ (33) రౌడీషీటర్, అతడికి ఓల్డ్ మలక్ పేటలో సొంత ఇల్లు ఉండడంతో తరచూ వస్తుంటాడు. శనివారం అర్ధరాత్రి ఓల్డ్ మలక్ పేటలోని మహమూద్ మరో […]

Written By: Suresh, Updated On : July 18, 2021 11:19 am
Follow us on

వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇతర రౌడీషీటర్ల చేతుల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం కేపిన ఈ ఘటన చాదర్ ఘాట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం టౌలీచౌకి హుయాయున్ నగర్ కు చెందిన సయ్యద్ ముస్తాక్ ఉద్దీన్ (33) రౌడీషీటర్, అతడికి ఓల్డ్ మలక్ పేటలో సొంత ఇల్లు ఉండడంతో తరచూ వస్తుంటాడు. శనివారం అర్ధరాత్రి ఓల్డ్ మలక్ పేటలోని మహమూద్ మరో యువకులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. అదికాస్త ముదరడంతో అగ్రహానికి గురైన వారంతా సయ్యద్ ముస్తాక్ ఉద్దీన్ ను కత్తులతో పొడిచారు. ముస్తాక్ అక్కడికక్కడే మృతి చెందాడు.