https://oktelugu.com/

ఆ క్లాసిక్ మూవీ మొదలు వెనుక కారణం ఇదే !

తెలుగు వెండితెరపై వైవిధ్యానికి ప్రతినిధిలా నిలిచిపోయింది ‘ఆదిత్య 369’ సినిమా. అది 1991, జులై 18న గోడ మీద విస్తృతంగా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్స్ లో బాలకృష్ణ రెండు గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గెటప్. ఇక సినిమా ఎలా ఉంటుంది అని కూడా ప్రేక్షకుడు ఆలోచించలేదు. టికెట్‌ కొనుక్కొని థియేటర్‌ లోకి అడుగు పెట్టాడు. సినిమా మొదలైంది. టైమ్‌ మెషీన్‌ సీన్ లో అనుకుంటా.. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రతి ప్రేక్షకుడు కృష్ణదేవరాయల కాలానికి […]

Written By: , Updated On : July 18, 2021 / 11:14 AM IST
Follow us on

Aditya 369

తెలుగు వెండితెరపై వైవిధ్యానికి ప్రతినిధిలా నిలిచిపోయింది ‘ఆదిత్య 369’ సినిమా. అది 1991, జులై 18న గోడ మీద విస్తృతంగా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్స్ లో బాలకృష్ణ రెండు గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గెటప్. ఇక సినిమా ఎలా ఉంటుంది అని కూడా ప్రేక్షకుడు ఆలోచించలేదు. టికెట్‌ కొనుక్కొని థియేటర్‌ లోకి అడుగు పెట్టాడు. సినిమా మొదలైంది.

టైమ్‌ మెషీన్‌ సీన్ లో అనుకుంటా.. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రతి ప్రేక్షకుడు కృష్ణదేవరాయల కాలానికి వెళ్లిపోయినట్లు ఫీల్ అవుతున్నాడు. అప్పటి కాలాన్ని అద్భుతంగా చూపించడంతో సభలో ఎదురుగా కూర్చున్న అష్టదిగ్గజాలకు మల్లే ప్రేక్షకులు కూడా దేవరాయలు సాహిత్య అభిలాషను ఆస్వాదిస్తున్నారు. కట్ చేస్తే.. ప్రేక్షకుడు భవిష్యత్తులోకి వెళ్లాడు. భూగర్భంలో బతుకుతున్న మానవజాతి ఎలా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు పడుతుందో చూశాడు.

కాసేపటికి సినిమా ముగిసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతి కలిగింది. ఇలా కూడా సినిమా చెయ్యొచ్చా ? అనే సంభర్చార్యం ఇప్పటికీ కలుగుతుంది. అంతలా ప్రేక్షకుడి మనసు పై ముద్రవేసిన ఈ క్లాసిక్‌ మూవీ గురించి ఇప్పుడు కొత్తగా ఏమి చెప్పగలం. అయితే. అసలు ఈ సినిమా ఆలోచన ఎలా పుట్టిందో తెలుసా?

వైవిధ్య చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘టైమ్‌ మెషీన్‌’ అనే నవలను చదివి ప్రేరణ పొందారు. ఆ నవల స్ఫూర్తిగా ఈ సినిమా తీయాలని భావించి భూతకాలంలోకి, భవిష్యత్‌లోకి ప్రయాణపు సీన్స్ రాసుకుని పూర్తి కథను సిద్థం చేశారు. బాలకృష్ణ హీరో అనుకున్నాక, హీరోయిన్‌ గా విజయశాంతిని అనుకున్నారు. కానీ, విజయశాంతి డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో హీరోయిన్ గా మోహినిని ఎంపిక చేశారు.