రవితేజ జోష్ మీదున్నాడు. ఇటీవలే ఆయన తీసిన ‘క్రాక్’ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ‘రమేశ్ వర్మ’ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ దీనికి నిర్మాత.
ఖిలాడీ సినిమా షూటింగ్ ఇప్పటివరకు బాగానే జరిగింది. కానీ అకస్మాత్తుగా రవితేజ ఈ చిత్రాన్ని పక్కనపెట్టినట్టు టాక్. ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే కొత్త సినిమా షూటింగ్ కు రవితేజ హాజరైనట్టు తెలిసింది.
రవితేజ ఉద్దేశపూర్వకంగానే ‘ఖిలాడీ’ మూవీని పక్కనపెట్టారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.రవితేజ కేటాయించిన కాల్ షీట్లను ‘ఖిలాడీ’ టీం వినియోగించలేదని తెలిసింది. ప్రస్తుతానికి కాల్ షీట్లు అయిపోవడంతో రవితేజ తన కొత్త చిత్రంవైపు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఖిలాడీ మూవీ అసంపూర్తిగా మిగిలిపోయినట్లు తెలిసింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు రవితేజ ఖిలాడీని పక్కనపెట్టినట్లు తెలిసింది.
రవితేజ తన కాల్షీట్లు, రెమ్యూనరేషన్ విషయంలో ఖచ్చితంగా ఉంటాడట.. ఎటువంటి సంకోచం , మోహమాటం లేకుండా వృత్తిపరమైన విషయాల్లో వ్యవహరిస్తాడట.. సినిమాల్లో స్నేహాన్ని ఎప్పుడూ అలుసుగా తీసుకోడని చెబుతారు.
ఇక తన కెరీర్ లోనే అత్యధికంగా రూ.15 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కోసం సంతకం చేసి షూటింగ్ కు హాజరు అవుతున్నట్టు చెబుతున్నారు.
ఇచ్చిన కాల్ షీట్లలో సినిమాను పూర్తి చేయకుండా ఉల్లంగించినందుకు చిత్రం యూనిట్ దే తప్పు అని.. రవితేజ ఖిలాడీ సినిమా కోసం బాగానే రోజులు వచ్చాడని ఆయన అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
రవితేజ ఇచ్చిన షాక్ తో ఖిలాడీ దర్శకుడు, నిర్మాత ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.