Rohit Sharma : మిగతా ఆటగాళ్లకు ఫామ్ అనేది బ్రహ్మ పదార్థం. రోకో(రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) కిమాత్రం ఫామ్ అనేది జుజుబి. మైదానంలో కొన్ని సందర్భాల్లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవచ్చు గాని..అన్నిసందర్భాలలో వారు మెరుపులు మెరిపిస్తారు. ఉరుములకు సరైన అర్థాన్ని చెబుతారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీమిండియా వన్డే సిరీస్ ఆడింది. బరోడా లో ఆడిన మ్యాచ్ లో కేవలం 8 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయి. దీనిని బట్టి జట్టులో రోకో రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
రోహిత్, విరాట్ మీద గంభీర్ వచ్చిన తర్వాత ఒత్తిడి పెరిగిందనేది నిర్వివాదం. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాతా వారిద్దరూ ఆ పార్మాట్ నుంచి తప్పుకున్నారు. టెస్ట్ లలో టీమిండియా సరిగ్గా ఆడటం లేని గంభీర్ ఫైర్ అవడం మొదలు పెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక మ్యాచ్ కు రోహిత్ ను దూరం చేశాడు. ఆ సిరీస్ తర్వాత రోహిత్ పై ఒత్తిడి తీసుకురావడంతో అతడు సారథ్య బాధ్యతల నుంచి మాత్రమే కాకుండా , ఆ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. కోహ్లీ కూడా అదే దారిని అనుసరించాడు.
వన్డేలకు పరిమితమైన రోహిత్ నుంచి కెప్టెన్సీని గిల్ కు అప్పగించాడు గంభీర్. అంతేకాదు, ఇటీవలి వన్డే సిరీస్ లలో రోహిత్ మెరిసినప్పటికీ 2027వరల్డ్ కప్ జట్టు ఎంపికలో రోహిత్, విరాట్ కు చోటు కేటాయించడం పై గంభీర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయానికి జట్టులో ఎవరుంటారో? ఎవరుండరో? అని చిత్తకాల బోధన చేశాడు. అంతేకాదు, వన్డే వరల్డ్ కప్ నాటికి విరాట్, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే వయసును కోల్పోతారని సొంత భాష్యం చెప్పాడు గంభీర్.
ప్రస్తుత ఐపీఎల్ లో రోహిత్, విరాట్ కుర్రాళ్ల మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నారు. విరాట్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. కడదాకా నిలబడి జట్టును గెలిపించాడు. కోల్ కతాతో జరుగుతున్నమ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు.
శనివారం విరాట్.. ఆదివారం రోహిత్ హఫ్ సెంచరీలు చేశారని.. గౌతమ్ గంభీర్ కు ఇక మంగళవారమేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వయసు పెరిగిపోయిందని, ఆడటానికి సరిపోరని గౌతమ్ గంభీర్ విమర్శించాడు. ఇప్పుడు అతడు తల ఎక్కడ పెట్టుకుంటాడు.. కుర్రాళ్లతో సరిగ్గా పరుగులు చేస్తున్నారు. వీరిని కాదని గౌతమ్ గంభీర్ వేరే వాళ్లకు చోటు ఇవ్వగలడా అంటూ రోకో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.