Homeజాతీయ వార్తలుChhattisgarh double marriage : ఎవడ్రా వాడు.. ఆ గుండె బతకాలి.. ఒకరికి తెలియకుండా మరొకరితో...

Chhattisgarh double marriage : ఎవడ్రా వాడు.. ఆ గుండె బతకాలి.. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ..ఇద్దరితో ఒకేసారి పెళ్లి

Chhattisgarh double marriage : నేటికాలంలో 35 వచ్చినా యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కులాల పట్టింపు లేదు. మతాల గొడవ లేదు. కట్నాలు అసవరం లేదు. పెళ్లి ఖర్చలు వద్దు. బంగారం మేమే పెట్టుకుంటాం. గ్రాండ్ గా పెళ్లి నిర్వహిస్తామని చెప్పినా.. పిల్లను ఇవ్వడానికి ముందుకురావడం లేదు. దీంతో చాలా మంది యువకులు ఒంటికాయ శొంఠికొమ్ము లాగా మిగిలిపోతున్నారు. ఏక్ నిరంజన్ లాగా బతుకీడుస్తున్నారు.

అసలు పెళ్లి జరగడమే జాక్ పాట్ అనుకుంటున్న నేటికాలంలో ఓ యువకుడు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టాడు. దీంతో చూసేవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం మీడియాలో పడిసంచనలం కావడంతో విన్నవాళ్లు, వీక్షించిన వాళ్లు నోరెళ్లపెట్టారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లా బైల్ గావ్ ప్రాంతానికి చెందిన హితేశ్ యాదవ్ కొంతవరకు చదువుకున్నాడు. స్థానికంగా ఓ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడు యామిని దెహారీ అనే యువతిని ప్రేమించాడు. ఆమె కంటే ముందు పూల్ వతి అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఆమె ఒప్పుకోలేదు. దీంతో అనేక రకాలుగా ఆమెకు చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో హితేశ్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు.

యామిని అనే యువతిని ప్రేమించాడు. ఆమెకు దగ్గరయ్యాడు. తన గతం గురించి చెప్పాడు. దానికి యామిని ఇంప్రెస్ అయింది. ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది. యామిని, హితేష్ పెళ్లి జరుగుతుండగా పూల్ వతి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హితేశ్ ఒప్పుకోలేదు.

చాలాసేపు కల్యాణ మండపంలో రచ్చ చోటు చేసుకుంది. చివరికి వారుముగ్గరు ఓ అంగీకారానికి వచ్చారు. ఫలితంగా బంధువులు అందరూ చూస్తుండగా హితేశ్ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. బంధువులు షాక్ లో ఉండగానే.. ఆ ముగ్గురు కల్యాణమండపంలో ఏడడుగులు నడిచారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version