Lenin First Day Collections: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేలా చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, టాక్ రావడం తో మొదటి రోజు ఫస్ట్ షోస్ నుండి సెన్సేషనల్ ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. సెకండ్ షోస్ అయితే వేరే లెవెల్ అనొచ్చు. మొదటి మూడు షోస్ ని కలిపితే ఎంత గ్రాస్ వస్తుందో , సెకండ్ షోస్ కి ఆ రేంజ్ గ్రాస్ వచ్చిందని నిర్మాత నాగవంశీ స్వయంగా నేటి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 1 కోటి 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు 3 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 72 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 67 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 41 లక్షలు , గుంటూరు నుండి 62 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 37 లక్షలు , నెల్లూరు నుండి 25 లక్షలు వచ్చాయి. ఓవరాల్ తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 8 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి ఏకంగా 1 కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 7 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 13 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 22 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. మొదటి రోజే 33 శాతం రీకవరీ అయ్యింది. ఈరోజు , రేపటితో బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ నెంబర్ ని దాటనుంది ఈ చిత్రం. అలా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ , కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ అందుకోవడం అక్కినేని ఫ్యాన్స్ కి మంచి ఊపుని ఇచ్చింది.
