Homeక్రీడలుCameron Green : మా బాబే.. 25.20 కోట్లు పెట్టి కొంటే చేసింది 18 పరుగులు..

Cameron Green : మా బాబే.. 25.20 కోట్లు పెట్టి కొంటే చేసింది 18 పరుగులు..

Cameron Green : పిండికొద్దీ రొట్టె అంటారు కదా.. ఐపీఎల్ ఈ సామెతను రియాలిటీలో చూస్తారు. ధర ఎక్కువ పలికిన ఆటగాడు భారీగా పరుగులు లేదా వికెట్లు తీయాలని జట్ల యాజమాన్యాలు కోరుకుంటాయి. ఐపీఎల్ లో భారీగా ధర పొందిన ఆటగాళ్ల మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. విమర్శకులు, విశ్లేషకులు భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఆటతీరును నిశితంగా గమనిస్తుంటారు.

గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోల్ కతా జట్టు ఆసీస్ ఆటగాడు గ్రీన్ ను 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్ లో ఇదొకటి. గ్రీన్ కు భారీగా ధర చెల్లించిన నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ లో అతడి గురించి విపరీతమైన చర్చ నడిచింది.

గ్రీన్ భారీగా పరుగులు చేస్తాడని.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను అధిగమిస్తాడని అందరూ అనుకున్నారు. తొలి మ్యాచ్ లోనే అతడు విఫలమయ్యాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్నఅతడు 18 పరుగులు చేశాడు. అలెన్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గ్రీన్..బీభత్సంగా బ్యాటింగ్ చేయాల్సి ఉండగా.. అతడు మాత్రం తన వంతు బాధ్యత కూడా నిర్వర్తించలేకపోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అతడు కనుక నిలబడి ఉంటే కోల్ కతా స్కోరు మరోవిధంగా ఉండేది.

గ్రీన్ ఇటీవలి పాకిస్థాన్ టీ20 సిరీస్ లో ఆకట్టుకోలేకపోయాడు. పాకిస్థాన్ పిచ్ ల మీద బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పాకిస్థాన్ లో పిచ్ లకు, భారత్ లో పిచ్ లకు కొంతతేడా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అదే వైఫల్యాన్ని గ్రీన్ ఐపీఎల్ కొనసాగించడాన్ని కోల్ కతా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 25.20 కోట్లు తీసుకున్న ఆటగాడు ఇలా ఆడతాడా అంటూ విమర్శిస్తున్నారు.

గ్రీన్ ఇటీవలి కాలం సరైన ఆట తీరు కొనసాగించలేకపోతున్నాడు. తనస్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఐపీఎల్ లో ఆ వైఫల్యాలకు చెక్ పెడతాడని అందరూ అనుకుంటుండగా.. అతడు మాత్రం ప్లాట్ పిచ్ పై తేలిపోయాడు. భారీగా పరుగులు చేయాల్సిన చోట స్వల్ప పరుగులకే వెనుతిరిగాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version