Rohit Sharma : టీమిండియా మాజీ సారధి రోహిత్ శర్మకు బలమైన రికార్డు ఉంది. అంతకుమించిన అభిమానుల బలం ఉంది. అందువల్లే ఇటీవల అతడిని వన్డే ఫార్మాట్ నుంచి సారధిగా తప్పిస్తే చాలామంది అభిమానులు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ను విమర్శించారు. గౌతమ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రోహిత్ శర్మకు అండగా నిలిచారు. మైదానంలో ఆటగాడిగా, నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించిన రోహిత్ శర్మ ప్రచారం కోసం పాకులాడుతాడా? ప్రచారం కోసం ఎంతకైనా దిగజారతాడా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు లభిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ విస్తృతంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో రోహిత్, అతని భార్య, శ్రేయస్ అయ్యర్ కనిపిస్తున్నారు. చూడబోతే ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం అది ఒక స్పోర్ట్స్ అవార్డుల ఫంక్షన్ లాగా అనిపిస్తోంది. అందులో అవార్డులు తీసుకోవడానికి రోహిత్, అయ్యర్ వంటి వారు వచ్చారు. నిర్వాహకులు పేరు ప్రకటించడంతో అయ్యర్ వెళ్లి తన అవార్డును తీసుకొని వచ్చాడు. నిర్వాహకులు ఇచ్చిన అవార్డును తన కుర్చీ పక్కనపెట్టి.. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాడు అయ్యర్. ఇదే సమయంలో రోహిత్ అయ్యర్ వెనుక కూర్చున్నాడు. రోహిత్ పక్కన అతని భార్య ఉంది. అయ్యర్ అవార్డు కింద పెట్టిన దృశ్యాన్ని రోహిత్ భార్య చూసింది. ఆమె వెంటనే అప్రమత్తమైంది. ఇదే విషయాన్ని రోహిత్ చెవిలో గుసగుసగా చెప్పింది. దీంతో వెంటనే రోహిత్ ఆట్రోఫీని తీసుకుని కుర్చీ మీద పెట్టాడు.
వాస్తవానికి ఇందులో ఏమంత గొప్పదనం లేకపోయినప్పటికీ.. రోహిత్ ఆ ట్రోఫీని తీసుకుని కుర్చీ మీద పెట్టడంతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. అవార్డులు అంటే రోహిత్ శర్మకు చాలా గౌరవమని అతని అభిమానులు పేర్కొన్నారు. అయ్యర్ దూకుడు తనం వల్ల అవార్డులను పెద్దగా లెక్కచేయడని.. అందువల్లే వచ్చిన అవార్డును కుర్చీ మీద కాకుండా, కింద పెట్టాడని నెటిజన్లు పేర్కొన్నారు. వాస్తవానికి అవార్డు కుర్చీ మీద పెట్టే స్పేస్ లేక అయ్యర్ కింద పెట్టాడు. కానీ ఈ విషయాన్ని గుర్తించిన రోహిత్ భార్య.. తన భర్తకు చెవిలో గుసగుస చెప్పడంతో.. అప్రమత్తమైన రోహిత్ ఆ అవార్డును కుర్చి మీద పెట్టాడు. వాస్తవానికి ఆ దృశ్యాన్ని కూడా రోహిత్ చూశాడు. ఆ జ్ఞాపికను కుర్చీ మీద పెట్టాలనే సోయి అతనిలో కలగలేదు. దీంతో భార్య చెప్పడంతో రోహిత్ ఆ పని చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. తన భార్య చెప్పడం ద్వారా రోహిత్ ఆ పని చేశాడని.. పిఆర్ కోసం రోహిత్ ఈ పని చేశాడని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ సొంతంగా ఆ పని చేయలేదని.. భార్య చెబితేనే అలా చేశాడని.. రోహిత్ చేసిన ఆ పనిని సోషల్ మీడియాలో ఆయన అభిమానులకు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరికి రోహిత్ కూడా ఇంతకు దిగజారాడని వ్యాఖ్యానిస్తున్నారు.