
విరాట్ సారథ్యంలో టీమ్ ఇండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ కోల్పోయిన నేపథ్యంలో కెప్టెన్సీ విషయంపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే జట్టుకు సరైన నాయకుడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ బ్యాట్స్ మన్ సల్మాన్ బట్ కూడా తన యూట్యూబ్ లో ఇవే వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా తనకు హిట్ మ్యానే సరైన వ్యక్తని అనిపిస్తుందని చెప్పాడు.