https://oktelugu.com/

రేవంత్ సింహంలాంటోడు.. పులులు బలాదూర్: వర్మ

‘రేవంత్ రెడ్డి సింహంలాంటోడు.. ఈ సింహాన్ని చూసి పులులు అన్నీ భయపడనున్నాయి. రేవంత్ నియామకంతో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు కాంగ్రెస్ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది’’ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై, సినీ, రాజకీయాల్లోని అప్డేట్ లపై ఆసక్తికరంగా స్పందించే వర్మ తాజాగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంపై కూడా తనదైన శైలిలో స్పందించి కౌంటర్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు’ అని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2021 / 12:56 PM IST
    Follow us on

    ‘రేవంత్ రెడ్డి సింహంలాంటోడు.. ఈ సింహాన్ని చూసి పులులు అన్నీ భయపడనున్నాయి. రేవంత్ నియామకంతో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు కాంగ్రెస్ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది’’ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

    ఎప్పుడూ వివాదాస్పద అంశాలపై, సినీ, రాజకీయాల్లోని అప్డేట్ లపై ఆసక్తికరంగా స్పందించే వర్మ తాజాగా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంపై కూడా తనదైన శైలిలో స్పందించి కౌంటర్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

    ఇక సోనియా, రాహుల్ గాంధీలపై కూడా వర్మ సెటైర్లు వేశారు.. ‘‘హేయ్ రాహుల్ గాంధీ.. నువ్వు మీ అమ్మ సోనియా గాంధీ మంచి పనిచేశారు. సింహంలాంటి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై చాలా రోజుల తర్వాత ఇష్టం పెరిగింది.. ’ అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.

    చాలా తర్జనభర్జనల తర్వాత ఎన్నో అడ్డంకులు దాటి మరీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి చేపట్టాడు. సొంత పార్టీలోని బలమైన పోటీదారులను పక్కకు తప్పించి మరీ ఈ అత్యున్నత పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ముడున్నరేళ్లలోనే ఈ పదవిని అందుకోవడం విశేషమనే చెప్పాలి.