
వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మంల కేంద్రంలోని వికాస్ నగర్ లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభులపైనే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తల్లి పద్మ(55) అక్కడికక్కడే చనిపోగా యువకుడి తండ్రి రవి, సోదరి నీరజకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్ లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు. అయితే రాకేశ్ కుటుంబ సభ్యులపై ఎందుకు దాడికి పాల్పడ్డాడో కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.