
కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగటివ్ గా తేలితే అతడు టీమ్ బయోబబుల్ తో చేరుతాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మూడు వారాల బ్రేక్ దొరకడంతో బబుల్ నుంచి బయటకు వచ్చిన పంత్ కు ఈనెల 8న కరోనా సోకింది. మరోవైపు మంగళవారం నుంచి కౌంటీ లెవన్ తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్ లో పంత్ స్థానంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.