
తమిళ ‘అసురన్’ సినిమా తెలుగులో ‘నారప్ప’ పేరుతో గత రాత్రి ఓటీటీ వేదికగా విడుదలయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా ముందుగా థియేటర్లలోనే విడుదలవుతుందని భావించారు. అయితే లాస్ట్ మినిట్లో ఆమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. ‘అసురన్’ ను తెలుగులో శ్రీకాంత్ అడ్డాల రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సినిమా రివ్యూ పేరిట కొందరు చేస్తున్న పోస్టులపై వెంకీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాడ్ పోస్టులకు వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నారు.
వెంకటేశ్ నటించిన ‘నారప్ప’పై సోషల్ మీడియాలో ఓ వర్గం వారు ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలోని ‘చూడప్ప నారప్ప.. నువ్వు అసురన్ లాంటోడివి.. ఇక్కడ పేర్లు మాత్రమే వేరు..మిగతాదంతా సేమ్ టు సేమ్’ అంటూ కొందరు పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. తమిళంలోని ‘అసురన్’కు ‘నారప్ప’లో ఏమాత్రం తేడా లేదని, అచ్చుగుద్దినట్లు కాపీ తీశారని వారు పేర్కొంటున్నారు. అయితే రీమేక్ చేసేటప్పుడు కొందరు డైరెక్టర్లు తెలుగు నేటీవిటీగా తగ్గట్లుగా కొన్ని మార్పులు చేస్తారు. కానీ నారప్ప విషయంలో అది జరగలేదని అంటున్నారు.
ఇక నారప్ప పై ధనుష్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. అసురన్ ను ఏమాత్రం తగ్గకుండా నారప్పగా తీశారు. వెంకటేశ్ మాస్ అండ్ ఎమోషనల్ సూపర్. అయితే వ్యక్తిగతంగా యాక్టింగ్లో మాత్రం ధనుష్ ఫర్ఫామెన్స్ వేరే ఉంది అని ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే వీటికి వెంకీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ‘రీమేక్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది.. టైటానిక్ సినిమాలాగా ఉంటుందా.. సినిమా ఎలా ఉందో చెప్పండి.. ఫర్ఫమెన్స్ గురించి కాదు..’ అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో వెంకీ తరువాత ఆయన కుమారుడిగా నటించిన కార్తీక్ రత్నం పాత్ర హైలెట్ గా నిలిచింది. ఈ క్యారెక్టర్ పై ప్రశంసలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన నటనే సినిమాకు మేజర్ ప్లస్ గా మారుతోంది. సోషల్ మీడియాలో రివ్యూలో వెంకీ తరువాత కార్తీక్ రత్నం పేరు బాగా వినిపిస్తోంది. మొత్తంగా నారప్ప సినిమాకు రివ్యూస్ మిక్స్ డ్ గా ఉన్నాయి. నెటిజన్ల నుంచి అదే తరహాలో రివ్యూస్ వస్తున్నాయి.