https://oktelugu.com/

Revanth: వైఎస్ చివరి కోరిక చెప్పిన రేవంత్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం గాంధీ భవన్ లో వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మండలి విపక్ష సభ్యడు షబ్బీలి అలీ, తదితరులు పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ వైఎస్ చనిపోయే ముందు ఆయనకొక ఆకాంక్ష ఉందని, భారత దేశానికి రాహుల్ గాంధీని ప్రధాన […]

Written By: , Updated On : September 2, 2021 / 02:54 PM IST
Follow us on

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం గాంధీ భవన్ లో వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మండలి విపక్ష సభ్యడు షబ్బీలి అలీ, తదితరులు పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ వైఎస్ చనిపోయే ముందు ఆయనకొక ఆకాంక్ష ఉందని, భారత దేశానికి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే కోరిక ఉందన్నారు. ఆయన ఆలోచనను అమలు చేయడం ద్వారా వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని టీకాంగ్రెస్ నేతలందరం భావిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.