
మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ చెత్త నగరంగా మారిందని, 16 నివాసయోగ్యమైన పట్టణాల గుర్తింపులో హైదరాబాద్ కు స్థానం రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన ఉందో అర్థం చేకుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓ కాంట్రాక్టరు మోరీలలో చెత్త తీయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను పిలిపించి ఆ మురుగునీటీలో కూర్చోబెట్టి, అతని పై చెత్త వేయించారని చెప్పారు. ఆ విధంగా మంత్రి కేటీఆర్ కు సన్నానం చేయాలని ఉందని రేవంత్ అన్నారు.